ఆగస్ట్ 5న యూత్‌స్టార్ నితిన్ 'లై' ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఆగస్ట్ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదల
యూత్‌స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఆగస్ట్ 5 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా 'లై' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఆగస్ట్ 5న చాలా గ్రాండ్‌గా చెయ్యబోతున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఆగస్ట్ 11నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మా హీరో నితిన్ పుట్టినరోజైన మార్చి 30న ఎనౌన్స్ చేశాం. ఆగస్ట్ 11కే సినిమాని రిలీజ్ చెయ్యాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. దానికి తగ్గట్టుగానే అన్నీ పక్కా ప్లానింగ్‌తో చేసుకుంటూ వచ్చాం. నితిన్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న 'లై' చిత్రం పెద్ద హిట్ అయి మా హీరో నితిన్‌కి, మా బేనర్ కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము.. అన్నారు.
యూత్‌స్టార్ నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.