Advertisementt

'ఆక్సిజన్' అప్ డేట్ వదిలారు..!

Mon 28th Aug 2017 11:49 PM
oxygen,gopichand,oxygen movie release date,am jothi krishna  'ఆక్సిజన్' అప్ డేట్ వదిలారు..!
Oxygen Set to Release on October 12 'ఆక్సిజన్' అప్ డేట్ వదిలారు..!
Advertisement
Ads by CJ

అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న 'ఆక్సిజన్'

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదలకానున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'ఆక్సిజన్'. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా 'ఆక్సిజన్' చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన 'ఆక్సిజన్' ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేసి.. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్" యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ

Oxygen Set to Release on October 12:

As per latest updates Gopichand starring movie Oxygen is set to release on October 12th. The film directed by AM Jothi Krishna and Produced by S. Aishwarya under the banner Shri Sai raam creations. Heroines Raashi Khanna and Anu Emmanuel will be seen romancing Gopichand in the movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ