Advertisementt

ఏమైనా 'పెళ్లి రోజు' లెక్క వేరు కదా!

Thu 31st Aug 2017 11:10 PM
pelli roju,pelli roju first look,  ఏమైనా 'పెళ్లి రోజు' లెక్క వేరు కదా!
Pelli Roju First Look Poster Launched ఏమైనా 'పెళ్లి రోజు' లెక్క వేరు కదా!
Advertisement
Ads by CJ

దినేష్, మియాజార్జి, రిత్విక, నివేత పెతురాజ్ ముఖ్యపాత్రల్లో సినీయోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో సురేష్ బల్లా, మృదుల మంగిశెట్టి నిర్మిస్తున్న చిత్రం 'పెళ్లి రోజు'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఈ  సందర్భంగా దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ మాట్లాడుతూ... జీవితంలో మర్చిపోలేని, మధురమైన రోజు పెళ్లిరోజే. పెళ్లిరోజు గురించి చాలా మంది కలలు కంటారు. ఆ కలల్ని సాకారం చేసుకునే వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ యువతీ యువకుడికైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి చూపుల్లో ఎంపిక చేసుకునే భాగస్వామి జీవితాన్నినందనవనం చెయ్యవచ్చు. నరకానికి దారీ చూపించవచ్చు. పెళ్లిరోజు సినిమా ఈ తరం భావాలకు అద్దం పడుతుంది. పెళ్లికాని ముగ్గురు యువతుల చుట్టూ తిరిగే ఓ సున్నితమైన కథే ఈ పెళ్లిరోజు. ప్రతి యువతికి తనకు కాబోయే వాడి విషయంలో కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉంటాయి. ఆ భావాలకు తగ్గవారిని ఎన్నుకోవాలనే అనుకుంటారు. అందుకు సమాజం, తల్లిదండ్రులు, పరిస్థితులు ఎన్నో అనుకూలించాలి.

ఒక్కోసారి తాము కోరుకున్నా పెద్దలు అంగీకరించకపోవచ్చు. మరో సందర్భంలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఒక యువతీ, యువకుడికి రాసి పెట్టి ఉండకపోతే పెళ్లి జరగదని కూడా అంటారు. యువతి, యువకుడు ఇద్దరూ ఇష్టపడి కలసి జీవించాలని నిర్ణయం తీసుకుంటే ఆ బంధం కళ్యాణానికి దారి తీస్తుంది. మూడు మూళ్ళ బంధం నూరేళ్ళ జీవితానికి నాంది పలుకుతుంది. పెళ్లి గురించి చాలా చిత్రాలే వచ్చి ఉండవచ్చు. అయితే ఈనాటి సమాజం, యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రమిది. అందుకు అనుగుణంగానే అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం అన్నారు. 

నిర్మాత సురేష్ బల్ల మాట్లాడుతూ.. ఇప్పటివరకు పెళ్ళి గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటి సమాజం, యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిత్రమిది. 

మృదుల మంగిశెట్టి మాట్లాడుతూ.... ఈ పెళ్లిరోజు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చెయ్యడానికి కృషి చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని.. అతనికి కృతజ్ఞతలు తెలియజేసారు.

మాటల రచయిత వెంకట్ మళ్లూరి మాట్లాడుతూ.. యువతరాన్ని ఆకట్టుకునే మంచి చిత్రమిది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా పని చేయడం సంతోషంగా ఉంది అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:వెన్నెలకంటి, భువనచంద్ర, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, సహా నిర్మాత:జె.వినయ్

Pelli Roju First Look Poster Launched:

cine yog motion pictures Pelli Roju First Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ