మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరిస్తున్న విజయ్ ఆంటోని 'ఇంద్రసేన' ఫస్ట్‌లుక్
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి, సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని హీరోగా, నిర్మాతగా నకిలీ, డా.సలీం, బిచ్చగాడు, భేతాళుడు, యెమన్ వంటి సూపర్‌హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. బిచ్చగాడు సినిమా తెలుగులో సృష్టించిన సెన్సేషన్ అందరికీ విదితమే. డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోని త్వరలోనే 'ఇంద్రసేన' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు నిర్మాణంలో విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ సెప్టెంబర్ 5న మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ...విజయ్ ఆంటోనిగారి సినిమాలంటే తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తెలుసు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో రికార్డ్ కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విలక్షణమైన కథలు, క్యారెక్టరైజేషన్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న విజయ్ ఆంటోని ఇంద్రసేన అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 5న మెగాస్టార్ చిరంజీవిగారు విడుదల చేస్తున్నారు. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి థాంక్స్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం..అన్నారు.