Advertisementt

రీ రికార్డింగ్‌లో 2 ఫ్రెండ్స్‌..!

Sat 25th Nov 2017 01:06 PM
2 friends,director srinivas glb,anathalakshmi creations banner  రీ రికార్డింగ్‌లో 2 ఫ్రెండ్స్‌..!
2 Friends Movie In Re Recording! రీ రికార్డింగ్‌లో 2 ఫ్రెండ్స్‌..!
Advertisement
Ads by CJ

యువతరం పరిచయాన్ని ప్రేమగా భావిస్తోంది. స్నేహాన్ని ప్రేమకు ముడిపెడుతోంది. దాంతో ప్రేమ గొప్పదా లేక స్నేహమా గందరగోలం ఏర్పడుతోంది. ఈ అంశాలను విపులంగా చర్చిస్తూ తెరకెక్కుతున్న చిత్రం '2 ఫ్రెండ్స్‌' (ట్రూ లవ్‌). తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సూరజ్‌ హీరోగా నటిస్తుండగా రవీంద్రతేజ, సానియా, స్నిగ్ద, కార్తీక్‌, సారా, ధన్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి ఇతర పాత్రధారులు.

2 ఫ్రెండ్స్‌ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా, కర్నాటకలో కూడా చిత్రీకరించారు. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో బెంగళూరు, అనంతపురం, వరంగల్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. షూటింగ్‌తో పాటుగా డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ప్రస్తుతం రీ రికార్డింగ్‌ జరుగుతోందని చెప్పారు. 

నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువతకు భవిషత్తు నిర్దేశకత్వం అవుతుంది. ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని' నిర్మాత ముళ్ళగూరు అనంతరాముడు చెప్పారు. మా సంస్థలో ఇది తొలిచిత్రం. కేవలం వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చే విధంగా ఉంటుంది. యూనిట్‌ అంతా సహకారం అందిస్తున్నారు' అని ఆయన తెలిపారు. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్‌ ఘటికాచలం. నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు, రచన, సంగీతం: ఘటికాలం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌

2 Friends Movie In Re Recording!:

2 Friends Movie Director by Srinivas G. L. B and Anathalakshmi creations banner this movie finally  doing re recording works. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ