Advertisementt

చిరంజీవి చిన్నల్లుడు చిత్రం సెట్టెక్కింది!!

Wed 31st Jan 2018 11:06 PM
kalyaan dhev,chiranjeevi son in law,rajamouli,vaaraahi banner,sai korrapati,kalyan kanuganti  చిరంజీవి చిన్నల్లుడు చిత్రం సెట్టెక్కింది!!
Chiranjeevi Son In Law Kalyaan Dhev Debut On Chiru Hands చిరంజీవి చిన్నల్లుడు చిత్రం సెట్టెక్కింది!!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం.12 ప్రారంభం !!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్ర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు (జనవరి 31) సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు నేడు తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.  

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. 'చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. 'బాహుబలి' చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. 'రంగస్థలం' చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం' అన్నారు. 

తారాగణం: 

కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు. 

ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి,  కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి.

Chiranjeevi Son In Law Kalyaan Dhev Debut On Chiru Hands:

Chiranjeevi Clap For Son In Law Kalyaan Dhev

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ