Advertisementt

హిట్ కోసం 'పంతం' పట్టిన హీరో..!

Sun 04th Feb 2018 08:01 PM
gopichand,25th film title,pantham,pantham movie,k chakravarthy director  హిట్ కోసం 'పంతం' పట్టిన హీరో..!
Gopichand 25th Film Title is Pantham హిట్ కోసం 'పంతం' పట్టిన హీరో..!
Advertisement
Ads by CJ

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై  గోపీచంద్ 25వ చిత్రం 'పంతం' ... మే 18న విడుద‌ల‌

'ఆంధ్రుడు, య‌జ్ఞం, ల‌క్ష్యం, శౌర్యం, లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం. దీనికి 'పంతం' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. `ఫ‌ర్ ఎ కాజ్` ఉప‌శీర్షిక‌.  బ‌లుపు, ప‌వ‌ర్‌, జై ల‌వకుశ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ... మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు 'పంతం' అనే టైటిల్‌ను నిర్ణ‌యించాం. సినిమా అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగంగా ఇప్ప‌టికే ఒక పాట‌, కొంత టాకీ పార్ట్ పూర్త‌య్యింది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించబడింది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను ద‌ర్శ‌కుడు చ‌క్రి చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయ‌న ఎందుకోసం పంతం ప‌ట్టాడు. ఆ కార‌ణ‌మేంట‌నేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.. అని తెలిపారు. 

గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

Gopichand 25th Film Title is Pantham:

Pantham is The Gopichand and K Chakravarthy Film Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ