Advertisementt

సాయిధరమ్ తేజ్ కి ఆ సినిమా ఉన్నట్లే!

Sun 18th Feb 2018 09:58 PM
sai dharam tej,gopichand malineni,director,bhagawan,pulla rao  సాయిధరమ్ తేజ్ కి ఆ సినిమా ఉన్నట్లే!
Sai Dharam, No Lessons Learnt! సాయిధరమ్ తేజ్ కి ఆ సినిమా ఉన్నట్లే!
Advertisement
Ads by CJ

మే నుంచి మొదలవ్వనున్న సాయిధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని ప్రొజెక్ట్ 

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావు మాట్లాడుతూ.. ''టాలెంట్ తో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొన్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త జోనర్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇదివరకు సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందనుంది. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారు'' అన్నారు.

Sai Dharam, No Lessons Learnt!:

Sai Dharam Signs His Flop Director Gopichand Malineni!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ