Advertisementt

''గూఢచారి'' అమెరికా షెడ్యూల్ మొదలు !!

Tue 20th Feb 2018 10:49 PM
adivi sesh,goodachari,usa,working,new horizons  ''గూఢచారి'' అమెరికా షెడ్యూల్ మొదలు !!
Adivi Sesh Goodachari USA Schedule Commenced! ''గూఢచారి'' అమెరికా షెడ్యూల్ మొదలు !!
Advertisement
Ads by CJ

'క్షణం' లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గూఢచారి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా మరియు తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్  మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో 'గూఢచారి' తెరకెక్కుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన  ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా 'గూఢచారి' చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అన్నారు. 

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: శివం రామ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల, నిర్మాతలు: అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్, కథ: అడివి శేష్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క. 

Adivi Sesh Goodachari USA Schedule Commenced!:

Multi talented Adivi Sesh is working on new horizons.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ