Advertisementt

శ్రీదేవిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం!

Tue 27th Feb 2018 01:23 AM
sridevi,kl narayana,t subbarami reddy,condolences  శ్రీదేవిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం!
TSR and KL Narayana About Sridevi శ్రీదేవిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం!
Advertisement
Ads by CJ

'శ్రీదేవి’ మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు - డా.టి.సుబ్బరామి రెడ్డి , ఎం.పి 

‘శ్రీదేవి’ హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు, ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. 'వేటగాడు, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి ఎన్నో తెలుగు చిత్రాలు బాలీవుడ్ లో యాష్ చోప్రా తాము రూపొందించిన ‘చాందిని, అలాగే లమ్హే’ చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఆమె కీర్తిని దశ,దిశలా వ్యాపింప చేశాయి. నిన్నగాక మొన్న ‘మామ్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి హఠాత్తుగా మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదన్నా సన్నివేశం ఇస్తే ఇలా చేయాలా? అలా చేయాలా? అని రిహార్సల్స్‌ చేసుకోకుండా అలా పాత్రను అర్థం చేసుకుని సహజంగానే నటించేస్తారు. అందుకే శ్రీదేవి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరని అంటుంటారు. అభిమానుల్లో ఆమెకున్న పేరు అంతా ఇంతా కాదు. బాల నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా స్టార్‌ కథానాయికగా ఎదిగారు. శ్రీదేవి అప్పటి యువ కథానాయకులతో నటిస్తూనే సీనియర్‌ నటులతోనూ చేసేందుకు ఏమాత్రం సంశయించలేదు. ‘బడి పంతులు’ చిత్రంలో ఎన్టీఆర్‌ మనవరాలిగా చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గా అదరగొట్టేశారు. ఇక ఏఎన్నార్‌తో పలు చిత్రాల్లో నటించిన ఈ ‘అతిలోక సుందరి’ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో కూడా నటించడం గమనార్హం. నటనకు వయసు ప్రమాణికం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పారు శ్రీదేవి. తన సినీ కెరీర్‌లో 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా ఈలోకాన్ని విడిచి వెల్లడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.

 

ఒక గొప్పస్టార్ ను కోల్పోయాము: డా. కే.ఎల్. నారాయణ

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో 'క్షణక్షణం' చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ, గర్వంగానూ ఉండేదని, అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు. 

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మ్రిత్రుడు ఎస్ గోపాల్ రెడ్డితో రూపొందించిన సినిమాలో శ్రీదేవిని నాయికగా ఎంపిక చేసుకున్నామని, అప్పటికే ఆమె పెద్ద స్టార్ అని నారాయణ తెలిపారు. తాము కొత్త నిర్మాతలమైనా అలాంటి భావన ఎప్పుడూ శ్రీదేవి వ్యక్తం చేయలేదని, చాలా గౌరవంగా ఉండేదని, ఏ సందర్భంలో కూడా మాకు అసౌకర్యం కలిగించలేదని, నంద్యాలలో షూటింగు చేసినప్పుడు పబ్లిక్ తో చాలా కష్టంగా ఉండేదని, అయినా శ్రీదేవి ఎంతో సహకరించిందని నారాయణ చెప్పారు. 

ఆ చిత్రం షూటింగు జరుగుతూ ఉండగా వారి నాన్నగారు చనిపోయారని, అయినా ఆ బాధను కనబడనీయకుండా షూటింగులో పాల్గొనడం నిజంగా ఆమె గొప్ప మనసుకు నిదర్శనమని నారాయణ చెప్పారు. 'క్షణక్షణం' చిత్రంలో ఆమె నటనకు నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చినందుకు అప్పట్లో తామెంతో సంతోషపడ్డామని నారాయణ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమని, నటిగా ఎన్నో శిఖరాలు అధిరోహించినా వినమ్రంగా ఉండే మనస్తత్వమని నారాయణ చెప్పారు. శ్రీదేవి మృతికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.  

TSR and KL Narayana About Sridevi:

TSR and KL Narayana Pay Condolences To Actress Sridevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ