Advertisementt

ఫిక్స్: నాగచైతన్య - సమంత కలిసిచేస్తున్నారు!

Thu 08th Mar 2018 03:20 PM
samantha,naga chaitanya,siva nirvana,ninnu kori  ఫిక్స్: నాగచైతన్య - సమంత కలిసిచేస్తున్నారు!
Naga Chaitanya and Samantha Combination Movie Fix ఫిక్స్: నాగచైతన్య - సమంత కలిసిచేస్తున్నారు!
Advertisement
Ads by CJ

లవ్లీ కపుల్ నాగచైతన్య-సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 

షైన్ స్క్రీన్స్ తమ సంస్థ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా.. 'నిన్ను కోరి' లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్ తో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 'ఏమాయ చేసావే, మనం' లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం చైతూ-సామ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ జంట కలిసి వెండితెరపై కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి-హరీష్ పెద్ది మాట్లాడుతూ.. నాగచైతన్య-సమంత జంటగా 'నిన్ను కోరి' ఫేం శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. నాగచైతన్య-సమంతల కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు.

Naga Chaitanya and Samantha Combination Movie Fix:

Naga Chaitanya, Samantha, Director Siva Nirvana And Shine Screens Production No. 2 Announcement 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ