Advertisementt

కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు వీరే!

Thu 15th Mar 2018 02:27 PM
sri kala sudha awards,20th sri kala sudha awards,bethireddy srinivas,phani madhav  కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు వీరే!
20th Sri Kala Sudha Awards Announced కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు వీరే!
Advertisement
Ads by CJ

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 20  సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 20వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నయ్‌లో పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20 మంది అవార్డు గ్రహీతలకు వెండి కిరీట ధారణ చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధప్రసాద్, వరప్రసాద్‌రెడ్డి, ఎ.ఎమ్.రత్నం, రామ్మోహన్‌రావు లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు. 

ఫణిమాధవ్ మాట్లాడుతూ కళాసుధ 20వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమం త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతోపాటు మహిళారత్న పురస్కారాలు అందజేయనున్నాం. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డును సాయికుమార్‌కు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి మాధవికి అందజేయనున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నిర్మాత కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు:

ఉత్తమ చిత్రం- శతమానం భవతి

ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం- ఓం నమో వేంకటేశాయ

ఉత్తమ సామాజిక చిత్రం- నేనే రాజు నేనే మంత్రి

ఉత్తమ హీరో- రానా

ఉత్తమ దర్శకుడు- క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)

ఉత్తమ నటి- కాజల్

ప్రత్యేక జ్యూరీ అవార్డు- విజయ్ దేవరకొండ

ఉత్తమ సంగీత దర్శకుడు- థమన్

ఉత్తమ కెమెరామెన్- ఛోటాకె.నాయుడు

ఉత్తమ నూతన నటుడు- ఘంటా రవితేజ్

ఉత్తమ నూతన నటీమణులు- రితికాసింగ్, సాయిపల్లవి, షాలినీ పాండే

ఉత్తమ పాటల రచయిత- సుద్దాల అశోక్‌తేజ

ఉత్తమ నూతన దర్శకురాలు- సుధా కొంగర (గురు)

20th Sri Kala Sudha Awards Announced :

Sri Kala Sudha Awards Announcement Press Meet Details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ