నిర్మాతలుగా ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గర్వంగా ఫీలవుతున్నాం - నిర్మాత భరత్ చౌదరి
నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సినిమాను నిర్మించారు. ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. సినిమా మార్చి 23న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ....
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - 'నేను సాధారణంగా నా స్వంత బ్యానర్లోనే సినిమాలు చేస్తుంటాను. బయట బ్యానర్‌లో చేసిన సినిమాలేవీ సరిగ్గా ఆడలేదు. అందుకు కారణాలు తెలియలేదు. కానీ నా మనసులో ఆ సెంటిమెంట్ ఉండిపోయింది. మన సినిమా ఆడి.. ప్రొడ్యూసర్‌కి డబ్బులు వస్తే అంతకంటే ఏం కావాలి? ఇంత పెద్ద సక్సెస్‌తో నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చిత్రమిది. ఒకటిన్నర సంవత్సరం తర్వాత నా సినిమా విడుదలై సక్సెస్ అందుకుంది. బాగా చదువుకుంటే నీకంటూ ప్రత్యేకమెన గుర్తింపు వస్తుందని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. ఇదే విషయం మన అందరి ఇళ్లలో రన్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్‌తో ఉన్న పాయింట్ చెప్పాడో అప్పుడే సినిమా సక్సెస్ అవుతుందనిపించింది. చైల్డ్ లేబర్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై కథను చేసి సినిమా చేసినందుకు ఉపేంద్ర మాధవ్‌కు థాంక్స్. గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారి సతీమణి ఫోన్ చేసి.. ‘ముందుగా థాంక్స్ చెబుతున్నాను. కమర్షియల్ సినిమా అంటే ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అమ్మాయిలను అశ్లీలంగా చూపిస్తారు. కానీ అవేవీ లేకుండా ఈ సినిమా కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంది’ అన్నారు. ప్రసాద్ మూరెళ్లగారు నన్ను ఎంతో అందంగా చూపించారు. సినిమా చూసినంత సేపు ఎంటర్ టైనింగ్‌గా ఉండాలి.. బోర్ కొట్టకూడదని అనుకుంటాను. అలాంటి మాటలు ఏవీ వినపడకుండా సినిమాను ఎడిట్ చేసిన తమ్మిరాజు గారికి థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు మనకు సహకారం అందించిన అందరినీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. నా మేకప్ మేన్ వెంకట్ సహా రాజు, రాకీ, గౌస్, డ్రైవర్ తిరుపతి ..ఎప్పుడూ నా వెన్నంటే ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లు నాకు ఎం కావాలో అవన్నీ అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే తాహిర్ టెక్ తాహీర్, నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడే తను జర్నీని స్టార్ట్ చేశాడు. ప్రతి యన్.టి.ఆర్.ఆర్ట్స్ సినిమాకు తన వంతు సపోర్ట్ చేశారు. అతనొక్కడే సినిమాతో మణిశర్మగారు మంచి హిట్ ఇచ్చారు. మళ్లీ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రి రికార్డింగ్ అయితే అదరగొట్టేశారు. వంశీ కాక, మహేష్ కోనేరు.. పి.ఆర్.ఓలుగా నాకు ఈ సినిమా విషయంలో ఎంతో సహకారం అందించారు. ఫైట్ మాస్టర్ వెంకట్‌తో పనిచేయడం సులభంగా ఉంటుంది. తనతో మంచి అనుబంధం ఉంది. అలాగే రియల్ సతీశ్‌గారికి కూడా థాంక్స్. కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శోభిలకు థాంక్స్. డబ్బింగ్ టెక్నీషియన్ పప్పుకు థాంక్స్. టెక్నీషియన్స్, నటీనటులు లేకుంటే కేవలం హీరో మాత్రమే సినిమా చేయలేడు. కాజల్ అగర్వాల్..కమిట్‌మెంట్ ఉన్న నటి. విదేశాల్లో అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేయడానికి తన వంతు సహకారాన్ని అందించింది. తను లక్కీ హీరోయిన్. ఈ ఉగాది, శ్రీరావునవమిని మరచిపోలేను. అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్' అన్నారు.
నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ - 'నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయే కాదు.. మంచి లక్షణాలున్న బంగారం. ఆయనకు గాయమైనా మాకు సపోర్ట్ అందించి సినిమాను సకాలంలో పూర్తి చేసేలా సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్‌గా హరేరామ్, ఇజం, ఇప్పుడు ఎం.ఎల్.ఎ సినిమాలో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాకు... నిర్మాతగా ఈ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ సక్సెస్‌తో గర్వంగా ఫీలవుతున్నాం. అలాగే కాజల్ డేట్స్ సమస్య వచ్చినా.. అడ్జస్ట్ చేసి సపోర్ట్ చేశారు. మా బ్యానర్‌లో ఆమె చేసిన రెండో సినిమా కూడా హిట్ కావడం ఆనందంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, తమ్మిరాజుగారి ఎడిటింగ్, మణిశర్మగారి మ్యూజిక్.. ఇలా అందరూ సక్సెస్‌లో తమ వంతు పాత్ర పోషించారు. ఉపేంద్ర సక్సెస్‌ఫుల్ రైటరే కాదు. ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కూడా అయ్యారు. మా బ్యానర్ ద్వారా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ని పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. సినిమా శాటిైలెట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ హక్కులను మంచి రేటుకు విక్రయించాం. ఇక కలెక్షన్స్ పరంగా నేటితో సేఫ్ జోన్‌లోకి వెళ్లాం. రేపటి నుండి మాకు వచ్చేవన్నీ ఓవర్‌ఫ్లో కలెక్షన్స్ మాత్రమే. అలాగే సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు, ఇతర యూనిట్ సభ్యులందరికీ థాంక్స్' అన్నారు.
ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ - 'రివ్యూస్ మిక్స్‌డ్‌గా వచ్చాయి అని డీలా పడ్డాను. అయితే నిన్న రాత్రి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌గారు ఇచ్చిన కలెక్షన్స్‌ను చూసి హ్యాపీగా అనిపించి నిర్మాతలతో మాట్లాడాను. మనం పెట్టిన డబ్బులు వచ్చేశాయండి అని వారు చెప్పడంతో హ్యాపీగా నిద్రపోయాను. నాకు అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారికి, నిర్మాతలకు, మణిశర్మగారు, ప్రసాద్ మూరెళ్ల, తమ్మిరాజు సహా... ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్' అన్నారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - 'చాలా మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. అలాగే సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.
ఈ కార్యక్రమంలో కోన వెంకట్, గిరిధర్, కరాటే కళ్యాణి, అజయ్ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.