Advertisementt

'తేజ్ ఐ లవ్ యు' రిలీజ్ డేట్ ఫిక్స్!

Thu 24th May 2018 12:00 PM
sai dharam tej,anupama parameswaran,tej i love u,june 29  'తేజ్ ఐ లవ్ యు' రిలీజ్ డేట్ ఫిక్స్!
'Tej I Love U' Release Date Confirmed 'తేజ్ ఐ లవ్ యు' రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌ యు' అనేది ఉపశీర్షిక. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది. 

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌,  పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

'Tej I Love U' Release Date Confirmed:

Sai Dharam Tej and Anupama Parameswaran Movie Release on June 29

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ