శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ సంస్థ సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్ సహ నిర్మాతగా, రాజేష్ నిర్మించిన 'అమ్మమ్మగారిల్లు' చిత్రం శుక్రవారం విడుదలై రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తోంది. శుక్రవారం ఉదయం విడుదలైన అన్ని థియేటర్లలలో 30 శాతం ఓపెనింగ్స్ తో మొదలైన కలెక్షన్స్ మ్యాట్నీ సమయానికి 60 శాతం పెరిగాయి. సాయంత్రం ఫస్ట్ షో నుంచి 75 శాతం కంటిన్యూ అవుతూ నిన్న (ఆదివారం) దాదాపు గా అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మూడు రోజుల్లో ఒక్క నైజాంలో ఒక కోటి రూపాయలు గ్రాస్ చేయగా, మిగిలిన ఏరియాలు అన్ని కలిపి మరో కోటిన్నర గ్రాస్ కలెక్షన్లతో సునామి సృష్టించింది ఈ 'అమ్మమ్మగారిల్లు'.
ఈ సందర్భంగా నిర్మాతలు రాజేష్, కె.ఆర్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా అనుకున్నట్లుగా 30 శాతం కలెక్షన్లతో మొదటి రోజు ఓపెనింగ్స్ మా 'అమ్మమ్మగారిల్లు' చిత్రానికి వచ్చాయి. మ్యాట్ని నుంచి పుంజుకుని ఆదివారం అయితే అన్నిచోట్లా హౌస్ ఫుల్ కావడం ఆనందం కలిగించింది. ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా మా సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది. మా 'అమ్మమ్మగారిల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నందుకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని అన్నారు.