Advertisementt

'ఆటగాళ్ళు' టైమ్ ఫిక్స్ చేశారు..!

Sun 03rd Jun 2018 01:08 PM
nara rohith,jagapathi babu,aatagallu,release date  'ఆటగాళ్ళు' టైమ్ ఫిక్స్ చేశారు..!
Aatagallu Release Date Fix 'ఆటగాళ్ళు' టైమ్ ఫిక్స్ చేశారు..!
Advertisement
Ads by CJ

ప్రపంచవ్యాప్తంగా జూలై 5న నారా రోహిత్, జగపతిబాబు 'ఆటగాళ్ళు' 

ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నారా రోహిత్‌, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. 'ఆంధ్రుడు' చిత్ర దర్శకుడు  పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఆటగాళ్ళు సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో దర్శనా బానిక్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. షూటింగ్ పూర్తి  చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంటరెస్టింగ్ డ్రామాగా తెరకేక్కబోతున్న ఈ సినిమాకు 'గేమ్ అఫ్ లైఫ్' అనే ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. నారా రోహిత్, జగపతి బాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం కాబోతున్నాయి. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. 

నటీనటులు: నారా రోహిత్, జగపతి బాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్... తదితరులు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్: పరుచూరి మురళి

నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కేనా రాము, వడ్లపూడి జితేంద్ర.

బ్యానర్: ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్ 

సంగీతం: సాయి కార్తీక్

కెమెరా మెన్: విజయ్ సి కుమార్

Aatagallu Release Date Fix:

Nara Rohith and Jagapathi Babu's Aatagallu releasing worldwide on July 5th!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ