Advertisementt

'శంభో శంకర' 3వ పాటకి దిల్ రాజు టచ్!

Mon 18th Jun 2018 12:30 PM
dil raju,shambo sankara,amalapuram,shambo sankara 3rd song,shakalaka sankar  'శంభో శంకర' 3వ పాటకి దిల్ రాజు టచ్!
Shambo Sankara Movie Third Song Launch Details 'శంభో శంకర' 3వ పాటకి దిల్ రాజు టచ్!
Advertisement
Ads by CJ

దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల...

శంక‌ర్ ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'శంభో శంక‌ర'. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. విడుదలైన 3 రోజులకే 30 లక్షల వ్యూస్ ను పొంది ఇప్పటికీ 40లక్షలకు పైగా చేరుకుంది. యూట్యూబ్ లొనే ఇదొక అరుదైన విశేషం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అమలాపురంలో ప్రముఖ నిర్మాత  దిల్ రాజు 'గుచ్చుకున్నావే' అనే 3వ పాటను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో ఈ పాటే హైలెట్ గా నిలవనుంది. 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. శంకర్ ఒక కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. అప్పటినుంచే ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. హీరోగా కూడా తాను రాణిస్తాడని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. పాటలు చాలా బాగున్నాయి. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న శంభో శంకర చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియచేసారు.

షకలక శంక‌ర్, కారుణ్య  నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద  శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తాలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

Shambo Sankara Movie Third Song Launch Details:

Dil Raju Launches Shambo Sankara 3rd Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ