Advertisementt

'శంభో శంక‌ర‌'.. రిలీజ్ కి రెడీ..!

Tue 26th Jun 2018 06:50 PM
sambho shankara,shakalaka shankar,suresh kondeti,karunya,sridhar  'శంభో శంక‌ర‌'.. రిలీజ్ కి రెడీ..!
Sambho Shankara Movie Ready to Release 'శంభో శంక‌ర‌'.. రిలీజ్ కి రెడీ..!
Advertisement
Ads by CJ

సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యు బై ఎ సాధించిన 'శంభో శంక‌ర‌'

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ 'శంభో శంక‌ర‌' ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యు బై ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రమిద‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అని ప్ర‌శంసించారు. 

పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ విన్న త‌ర‌వాత నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ.. ఇప్ప‌టికే టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించ‌డం అదృష్టం. ఇప్పుడు సెన్సార్ బృందం అంతే గొప్ప‌గా ప్ర‌శంసించింది. సెన్సార్ యు బై ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప‌రిశ్ర‌మ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం.. అని అన్నారు. 

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యు బై ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. గ్రూప్‌లో ఒక స‌భ్యుడు ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇద‌ని ప్ర‌శంసించారు. శంక‌ర్ కెరీర్‌కి ఉప‌క‌రించే చిత్ర‌మిది. త‌న‌తో పాటు... న‌టీన‌టులంతా అద్భుతంగా లీన‌మై న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రికీ కీల‌క‌ మ‌లుపునిచ్చే సినిమా అవుతుంది.. అన్నారు. 

షకలక శంక‌ర్, కారుణ్య  నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద  శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి  కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

Sambho Shankara Movie Ready to Release:

Sambho Shankara Movie Censor Completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ