Advertisementt

'ప్రేమకు రెయిన్ చెక్' రెడీ అవుతోంది..!

Tue 31st Jul 2018 09:08 PM
premaku raincheck,premaku raincheck movie,premaku raincheck movie shooting update,postproduction stage  'ప్రేమకు రెయిన్ చెక్' రెడీ అవుతోంది..!
Premaku Raincheck in Post Production Stage 'ప్రేమకు రెయిన్ చెక్' రెడీ అవుతోంది..!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమ రెయిన్ చెక్'. 'రెయిన్ చెక్' అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొంటోంది.

ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం విశేషాలను దర్శకనిర్మాత ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ వివరిస్తూ.. 'ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా 'ప్రేమకు రెయిన్ చెక్' చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ లోగోకు, మా కాన్సెప్ట్ కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేయనున్నాం. ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన నేను సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రం నిర్మించాను. లైఫ్, కెరీర్ అండ్ రొమాన్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. తిరస్కరించకుండా, ఒప్పుకోకుండా ప్రేమను పోస్ట్ పోన్ చేసి రెయిన్ చెక్ ఇచ్చిన పాత్రల కథ ఇది' అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.

Premaku Raincheck in Post Production Stage:

Premaku Raincheck Movie Shooting Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ