ప్రభుదేవా 'లక్ష్మి' సినిమా హక్కులు సొంతం చేసుకున్న సి. కళ్యాణ్ ..!!
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్.. ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'లక్ష్మి' సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి..
కాగా, నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా ఆడియో, రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ఆగష్టు 12 న ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగష్టు 24 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కోవై సరళ, సల్మాన్ యూసఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు..