జెస్సీ ఫస్ట్ లుక్ విడుదల
హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు.. నటీనటుల పనితీరుతో పాటు డైరెక్టర్ టేకింగ్.. సౌండ్, గ్రాఫిక్స్, కెమెరా వర్క్ వంటి టెక్నికల్ వేల్యూస్‌ను డిఫరెంట్‌గా ఎస్టాబ్లిష్ చేసేవే హారర్ చిత్రాలు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హారర్ చిత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇలాంటి తరుణంలో జెస్సీ అనే చిత్రం మార్చి మొదటి వారంలో సందడి చేయనుంది. అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న హారర్ థ్రిల్లర్ జెస్సీ. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్విని కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి మొదటి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత శ్వేతా సింగ్.
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్, శ్రీతా చందనా.ఎన్, విమల్ కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ట్రిల్స్: కృష్ణ, పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ భాను, విఎఫ్ఎక్స్: వెంకట్.కె, మేకప్: చిత్రా మోద్గిల్, సౌండ్ డిజైన్, మిక్సింగ్: విష్ణు పి.సి, అరుణ్.ఎస్, క్యాస్టూమ్ డిజైనర్: అశ్వంత్, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, కొరియోగ్రాఫర్: ఉదయ్‌భాను(యుడి), ఆర్ట్: కిరణ్ కుమార్.ఎం, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, మ్యూజిక్: శ‌్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్.ఎన్, ప్రొడ్యూసర్: శ‌్వేతా సింగ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినికుమార్.వి