టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు. నిన్నుకోరి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది.
షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం.
గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో టక్ జగదీష్ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్టును అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు.
నానితో ఇదివరకు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించిన రీతు వర్మ, కౌసల్యా కృష్ణమూర్తి ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.
టక్ జగదీష్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఔట్ డోర్ లొకేషన్లలో జరుగుతుంది.
తారాగణం: నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ.