విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో హీరో నాని నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ బ్యానర్ లో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం హిట్ రేపు ఉదయం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా పేరునే హిట్ అని పెట్టుకున్న ఈ చిత్రం హిట్ అనిపించుకుంటుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన సినిమాగా ఈ హిట్ చిత్రం పట్ల ఎక్కువ ఆసక్తి లేకపోయినా.. నాని నిర్మాణంలో వస్తుందనేసరికి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది.
ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి సాగే ఈ కథలో చాలా థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయట. అలాగే హీరోయిన్ గా నటిస్తున్న రుహానీ శర్మ, విశ్వక్ సేన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా జనాలకి బాగా నచ్చుతుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే స్నీక్ పీక్ అంటూ సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాన్ని వదిలితే మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.
సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాజమౌళి, రానా, అనుష్క వంటి స్టార్లని ఆహ్వానించి జనాల్లో సినిమా పట్ల మంచి క్రేజ్ సంపాదించుకోగలిగారు. మరి అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందా లేదా చూడాలి.