Advertisementt

‘పొగ‌రు’లోని ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

Mon 27th Jul 2020 10:14 AM
dhruva sarja,rashmika mandanna,pogaru movie,karabu,august 6  ‘పొగ‌రు’లోని ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
Pogaru Movie First Song Release date Fixed ‘పొగ‌రు’లోని ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న ‘పొగ‌రు’లోని ఫ‌స్ట్ సాంగ్ ‘క‌రాబు’ ఆగ‌స్ట్ 6న విడుద‌ల‌

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని స్టార్ యాక్ట‌ర్ల‌లో ఒక‌రైన ధ్రువ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పొగ‌రు’. హ్యాట్రిక్ యాక్ష‌న్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధ్రువ స‌ర‌స‌న నాయిక పాత్ర‌ను ర‌ష్మికా మంద‌న్న పోషిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ‘విక్ట‌రీ’, ‘అధ్య‌క్షా’, ‘ర‌న్న‌’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌గా నంద‌కిశోర్ మంచి పేరు సంపాదించారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్య‌క్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని గ్రాండియ‌ర్‌గా నిర్మిస్తున్నారు.

ఆగ‌స్ట్ 6న ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ విడుద‌ల‌తో తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు పాపుల‌ర్ క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చంద‌న్ శెట్టి బాణీలు అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్ర‌కాష్ ప‌నిచేస్తున్నారు.

సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి పేరుపొందిన న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ సూప‌ర్‌స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్న‌ర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం.

తారాగ‌ణం: ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా మంద‌న్న‌, సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్‌, చిక్క‌న్న‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, క‌రి సుబ్బు, ధ‌ర్మా, మ‌యూరి, త‌బ‌లా నాని, కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్న‌ర్‌, జాన్ లూకాస్‌

సాంకేతిక బృందం:

సంగీతం: చ‌ంద‌న్ శెట్టి

సినిమాటోగ్రీఫీ: ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌

ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌

నిర్మాత‌: బి.కె. గంగాధ‌ర్‌

ద‌ర్శ‌క‌త్వం: న‌ంద‌కిశోర్‌

బ్యాన‌ర్‌: శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్‌

Pogaru Movie First Song Release date Fixed:

Dhruva Sarja and Rashmika Mandanna Pogaru song Release details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ