Advertisementt

పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఫోర్ ప్లే’

Tue 28th Jul 2020 07:35 PM
fore play,shooting updat,post production stage  పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఫోర్ ప్లే’
Fore Play movie Latest Update పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఫోర్ ప్లే’
Advertisement
Ads by CJ

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బేబీ తనిష్క, జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా దర్శకుడు పి ప్రసాద్‌ను తొలిసారిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఫోర్ ప్లే’. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాల కోసం ఎలా పెడదోవ పడుతున్నారో... ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి కాబడుతున్నారో.. అలాకాకుండా డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో తుచ్ఛమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం. నూతన నటీనటులతో షూటింగ్ చేశారు. హీరోయిన్ హరిణి మాత్రం ‘పిచ్చెక్కిస్తా’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. హీరో శ్యామ్, హీరోకి ఫ్రెండ్స్‌గా శ్రీకాంత్, నితీన్ కొత్తవారిని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన మరొక హీరోయిన్ హారిక ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా కొత్తగా, రొమాంటిక్‌గా ఉంటుంది. ఈ చిత్రం లాక్ డౌన్ కారణాలవల్ల హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము అని చెప్పడం జరిగింది.

 

కరోనా వైరస్ కారణాలవల్ల థియేటర్స్ లేక యిబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానివలన OTT , ATT ప్లాట్ఫామ్స్‌లలో అన్ని భాషలలో సినిమాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్నది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తున్నాము అని చెప్పారు. హీరో; శ్యామ్, హీరోయిన్; హరిణి, నటీనటులు; హారిక, శ్రీకాంత్, నితీన్, రహీమ్ సిద్దిపేట్, సురేష్ తదితరులు. కెమెరా; రవి బైపల్లి, సంగీతం; శయక్ పార్వీజ్, ఎడిటర్; జెమా, మాటలు; సుదర్శన్, ఆర్ట్; వాసు,మేకప్ కుమార్, గ్రాఫిక్; RGB స్టూడియోస్, పబ్లిసిటీ డిజైన్స్; రాంబాబు పోస్టర్ యాడ్స్, PRO; ఆనందం రాంబాబు, స్టిల్స్: కిషోర్, పొడక్షన్ మేనేజర్; ముజీబ్ బాషా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి ప్రసాద్, సమర్పణ: బేబీ తనిష్క,జ్యోషిక, నిర్మాత: చిక్కవరపు రాంబాబు.

Fore Play movie Latest Update:

Fore Play movie in Post Production stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ