Advertisementt

శివాజీరాజా కుమారుడు హీరోగా.. మరో చిత్రం!

Thu 30th Jul 2020 10:45 AM
sivaji raja,vijay raja,new movie,jayadurga devi,multimedia production  శివాజీరాజా కుమారుడు హీరోగా.. మరో చిత్రం!
Sivaji Raja song Vijay Raja new movie Launched శివాజీరాజా కుమారుడు హీరోగా.. మరో చిత్రం!
Advertisement
Ads by CJ

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకంపై శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా నూతన చిత్రం ప్రారంభం 

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రంలో అయిదు పాటలు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశంలో సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నాగశౌర్య ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తం షాట్ కి తాను క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. 

అనంతరం హీరో విజయ్ రాజా పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో నాగశౌర్య అన్నకి చాలా ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు. 

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘నాకు అవకాశం ఇచ్చిన జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. నాకు మంచి నిర్మాత దొరికాడు, ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఓపెనింగ్‌కి వచ్చిన  హీరో నాగశౌర్యకి నా ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి పర్ఫెక్ట్. ఇది పూర్తీ ఎంటర్టైనర్ చిత్రం. శివాజీ రాజా గ్రాము కథ విన్నారు, ఆయనికి కథ బాగా నచ్చింది. మా హీరో గారు మాస్ కి క్లాస్ కి రెండిటికి సూట్ అవుతారు. అయన ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒరిస్సా లో టాప్ హీరోయిన్, మంచి నటి. నిర్మాత గారి తమ్ముడు ఇందులో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని తెలిపారు. 

శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలు. కథ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు. నాగశౌర్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి’’ అని కోరుకున్నారు. 

హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు’’ అని తెలిపారు. 

నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. ‘‘జయ దుర్గ దేవి మల్టీ మీడియా ఇది మా మొదటి సినిమా. మా కార్యక్రమానికి వచ్చినందుకు హీరో నాగశౌర్యగారికి ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్నాం, చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం. శివాజీ రాజాగారి అబ్బాయి విజయ్ రాజాతో చేయటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని అన్నారు. 

Sivaji Raja song Vijay Raja new movie Launched:

SIVAJI RAJA SON VIJAY RAJA new movie in JayaDurga Devi Multimedia Production

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ