Advertisementt

‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్ విడుదల

Thu 06th Aug 2020 05:21 PM
first look,different love story,radhakrishna,director sreenivass reddy  ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్ విడుదల
RadhaKrishna First Look Released ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

దర్శకుడు శ్రీనివాస రెడ్డి సమర్పణలో వైవిధ్యమైన ప్రేమకథాచిత్రం ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్ విడుదల.

‘టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, బొమ్మ‌న బ్రద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ , ఢ‌మ‌రుకం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా ‘రాగ‌ల 24 గంట‌ల్లో’ వంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో మెప్పించిన ద‌ర్శ‌కులు శ్రీనివాస‌రెడ్డి స‌మ‌ర్పిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న  చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని టి.డి. ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హారిణి ఆరాధ‌న క్రియేష‌న్స్‌, శ్రీ న‌వ‌హాస్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘రాధాకృష్ణ‌’ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా నిర్మాణ సార‌థి కృష్ణ కుమార్ మాట్లాడుతూ - ‘‘తెలంగాణ హెరిటేజ్ నిర్మల్ బొమ్మ. తెలంగాణ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటి చెప్పే ఎన్నో గొప్ప విశేషాల్లో నిర్మల్ బొమ్మ ప్ర‌త్యేక‌మైన‌ది. ఆదిలాబాద్ ఆట‌వీ ప్రాంతంలో ల‌భించే పొనికి చెక్క‌తో ప్రాణం పోసుకునే నిర్మల్ బొమ్మ త‌యారీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి త‌ర‌త‌రాల నుండి ఎంతో మంది క‌ళాకారులు జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అంత‌టి ఖ్యాతి గ‌డించిన నిర్మల్ బొమ్మ‌ కాలక్రమేనా ప్లాస్టిక్ బొమ్మ‌ల తాకిడికి, కుదుపుల‌కు లోన‌య్యింది. ఈ నేప‌థ్యంలో హృద‌యానికి హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తూ ఒక గొప్ప సందేశాత్మ‌క ప్రేమ‌క‌థ‌గా చిత్రీక‌రించాం. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుద‌లకు సిద్ధంగా ఉంది’’ అన్నారు.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ఎం.ఎం.శ్రీలేఖ‌, సినిమాటోగ్ర‌ఫీ:  సురేంద‌ర్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌:  పుప్పాల సాగ‌రిక‌, కృష్ణకుమార్, ద‌ర్శ‌క‌త్వం:  టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.

RadhaKrishna First Look Released:

First Look Of Different Love Story RadhaKrishna Presented By Director Sreenivass Redde Is Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ