Advertisementt

ప్రారంభమైన ‘క్రియేటివ్ క్రిమినల్’

Fri 14th Aug 2020 01:02 PM
creative criminal movie,pooja event,sunil,posani krishna murali,koudinya productions  ప్రారంభమైన ‘క్రియేటివ్ క్రిమినల్’
Creative Criminal Movie Launched ప్రారంభమైన ‘క్రియేటివ్ క్రిమినల్’
Advertisement
Ads by CJ

కౌడిన్య ప్రొడక్షన్స్ ‘క్రియేటివ్ క్రిమినల్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

కౌడిన్య ప్రొడక్షన్స్ లో రెండో చిత్రంగా వస్తోన్న క్రియేటివ్ క్రిమినల్ ఆగస్ట్ 13న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు కమెడియన్ సునీల్, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరా స్విచ్ ఆన్ నిర్మాత నర్సింగ్ గౌడ్ చెయ్యగా తొలి షాట్ కు క్లాప్ సునీల్ కొట్టగా.. ఫస్ట్ షాట్ డైరెక్షన్ పోసాని కృష్ణమురళి చేశారు.

ఈ సందర్భంగా కమెడియన్ సునీల్ మాట్లాడుతూ.. క్రియేటివ్ క్రిమినల్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల మంచి కథ రాసుకున్నాడు, ఈ మూవీ తప్పకుండా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు. 

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... చాలా రోజుల తరువాత ఒక మంచి రోల్ చెయ్యబోతున్నాను. కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్‌తో తెరకెక్కబోతున్న క్రియేటిక్ క్రిమినల్ సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది అన్నారు.

నిర్మాత నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ... కథ బాగా నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాను, మొదట చిన్న సినిమాగా చెయ్యాలి అనుకున్నా కూడా కథను బట్టి బిగ్ స్కేల్ లో ఈ సినిమా చేయబోతున్నాము, సునీల్ గారు మా సినిమాలో మంచి రోల్ చెయ్యబోతున్నారు అన్నారు.

డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ... ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘క్రియేటివ్ క్రిమినల్’ సినిమా. మంచి రోజు కావడంతో ఈ సినిమాను గురువారం ప్రారంభించాము. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు, ముఖ్యంగా నిర్మాత నర్సింగ్ గౌడ్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ మాలిక్ గారు మేము ఏది అడిగితే అది మాకు కల్పిస్తున్నారు. తెలుగులో ఇదివరకు రాని కాన్సెప్ట్‌తో వస్తున్నాము, తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. అన్నారు.

నటీనటులు:

మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్ ఉద్దీన్

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: కౌడిన్య ప్రొడక్షన్స్

ప్రొడ్యూసర్: నర్సింగ్ గౌడ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలీమ్ మాలిక్

డైరెక్టర్: ప్రభాస్ నిమ్మల

కెమెరామెన్: గణేష్ రాజు

ఫైట్స్: నభ

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఓరంపాటి కృష్ణరెడ్డి

Creative Criminal Movie Launched:

Creative Criminal Movie Pooja Event Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ