Advertisementt

‘చ‌క్ర’ ట్రైల‌ర్ ఒరిజ‌న‌ల్ సౌండ్ ట్రాక్‌ విడుదల

Sun 16th Aug 2020 11:01 PM
ost of chakra trailer,yuvan shankar raja,vishal,chakra movie  ‘చ‌క్ర’ ట్రైల‌ర్ ఒరిజ‌న‌ల్ సౌండ్ ట్రాక్‌ విడుదల
Impressive OST Of Action Hero Vishal Chakra Trailer Is Out ‘చ‌క్ర’ ట్రైల‌ర్ ఒరిజ‌న‌ల్ సౌండ్ ట్రాక్‌ విడుదల
Advertisement
Ads by CJ

ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ హీరో విశాల్ ‘చ‌క్ర’ ట్రైల‌ర్ ఒరిజ‌న‌ల్ సౌండ్ ట్రాక్‌

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ మూవీ ‘చ‌క్ర‌’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రెజీనా క‌సాండ్ర ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోగా ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‌ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. కాగా ఇండిపెండెన్స్ డే కానుక‌గా యువ‌న్ శంక‌ర్‌రాజా సంగీత సారథ్యంలోని ‘చ‌క్ర’ ట్రైల‌ర్ ఒరిజ‌న‌ల్ సౌండ్ ట్రాక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సౌండ్ ట్రాక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌ నేప‌థ్యంలో సరికొత్త క‌థాక‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Click Here for OST of Chakra Trailer

Impressive OST Of Action Hero Vishal Chakra Trailer Is Out:

OST of Chakra Trailer composed by Yuvan Shankar Raja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ