Advertisementt

‘జాంబీ రెడ్డి’లో తేజ స‌జ్జా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Mon 24th Aug 2020 05:51 PM
zombie reddy,teja sajja,first look,prashanth varma,zombie reddy movie  ‘జాంబీ రెడ్డి’లో తేజ స‌జ్జా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Teja Sajja’s First Look In Prashanth Varma’s Zombie Reddy Is Out ‘జాంబీ రెడ్డి’లో తేజ స‌జ్జా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

ప్ర‌శాంత్ వ‌ర్మ ‘జాంబీ రెడ్డి’లో తేజ స‌జ్జా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’లో హీరోగా ఎవ‌రు న‌టిస్తున్నార‌నే స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ ఆదివారం 10 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ‘ఇంద్ర’ చిత్రంలో చిన్న‌ప్ప‌టి చిరంజీవిగా న‌టించడంతో పాటు ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లూ పొంది, స‌మంత నాయిక‌గా న‌టించిన ‘ఓ బేబీ’లో ఓ కీల‌క పాత్ర‌లో ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో తేజ గ‌ద ప‌ట్టుకొని ఉండ‌గా, జాంబీలు అత‌నిపై ఎటాక్ చేయ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

మోష‌న్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే, వెన‌క‌వైపు మెగాస్టార్ చిరంజీవి బొమ్మ ఉన్న ష‌ర్ట్ ధ‌రించి స్టైల్‌గా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు తేజ‌. అత‌ను మ్యాచో లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మోష‌న్ పోస్ట‌ర్ బీజీఎంగా చిరంజీవి సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘దొంగ‌’లోని పాపుల‌ర్ సాంగ్ ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’ మ్యూజిక్‌ను ఉప‌యోగించారు. తేజ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ ఇంప్రెసివ్‌గా క‌నిపిస్తున్నాయి. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం గ‌మ‌నార్హం.

సాంకేతిక బృందం:

స్క్రీన్‌ప్లే: స‌్ర్కిప్ట్స్‌విల్లే

మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌

సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌

ఎడిటింగ్‌: సాయిబాబు

ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి

నిర్మాత‌: రాజ్‌శేఖ‌ర్ వ‌ర్మ‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌

బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌

Teja Sajja’s First Look In Prashanth Varma’s Zombie Reddy Is Out:

Zombie Reddy Movie Hero Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ