Advertisementt

‘తొలిశ్వాస’ షూటింగ్ పూర్తయింది

Thu 27th Aug 2020 08:08 AM
tholi swasa movie,shooting update,tholi swasa movie,shaik khaleed  ‘తొలిశ్వాస’ షూటింగ్ పూర్తయింది
Tholi Swasa Movie Shooting Completed ‘తొలిశ్వాస’ షూటింగ్ పూర్తయింది
Advertisement
Ads by CJ

ప్రీతమ్ అల్లాడి, శిఖా బత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలిశ్వాస’. ఈ చిత్రంతో ఖాలాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జెసీ.సి బ్యానర్‌పై జుబేర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తల్లిప్రేమ యొక్క గొప్పతనం చెబుతూ.. రొమాంటిక్ లవ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ నేపథ్యంతో.. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా ఈ ‘తొలిశ్వాస’ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తల్లిప్రేమను ఇప్పుడున్న జనరేషన్ ఎలా మిస్ అవుతున్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాము. అలాగే రొమాంటిక్ లవ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌తో మంచి మెసేజ్‌ని ప్రేక్షకులకు ఈ చిత్రంతో అందించబోతున్నాము. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఈ చిత్రంతో ఆవిష్కరించబోతున్నాం. యూత్‌కు, అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. మిస్టర్ తెలంగాణ, మిస్టర్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్ ప్రీతమ్, శిఖా బత్రల నటన ఈ చిత్రానికి మెయిన్ హైలెట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

ప్రీతమ్, శిఖా బత్ర, సంధ్యా జనక్, మణి మహేష్, రేణు వర్మ, జయరామ్, వైభవ్ శైలేష్, సంజీవ కుమార్, ప్రభ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్టంట్స్: రాజా, కొరియోగ్రఫీ: సందీప్, మ్యూజిక్: మహి మదన్ ఎమ్ఎమ్, ఎడిటర్: సునీల్, కెమెరామెన్: రమేష్, నిర్మాత: జుబేర్, దర్శకత్వం: ఖాలాద్.

Tholi Swasa Movie Shooting Completed :

Tholi Swasa Movie Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ