నటుడు వంశీ చాగంటి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్ నెం.1 చిత్ర యూనిట్.
‘ఈ మాయ పేరేమిటో, సూర్యకాంతం’ చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజయ్ హీరోగా SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బృంద రవిందర్ దర్శకత్వంలో E. మోహన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వంగవీటి చిత్రంతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న వంశీ చాగంటి నటిస్తున్నారు. సెప్టెంబర్ 2 వంశీ చాగంటి పుట్టినరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
రాహుల్ విజయ్, వంశీ చాగంటి తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్ ఎల్లుమహంతి,
సంగీతం: మణిశర్మ,
ఎడిటింగ్: కోటగిరి వెంటేశ్వర రావు,
స్టంట్స్: విజయ్,
లిరిక్స్: అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్,
నిర్మాత: E. మోహన్,
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: బృంద రవీందర్.