Advertisementt

‘జ‌య జాన‌కి నాయ‌క’ యూట్యూబ్‌లో రికార్డ్!

Fri 04th Sep 2020 10:18 PM
jaya janaki nayaka,hindi version,khoonkhar,youtube,sensation  ‘జ‌య జాన‌కి నాయ‌క’ యూట్యూబ్‌లో రికార్డ్!
Jaya Janaki Nayaka Hindi Version Gets 300 Million Views ‘జ‌య జాన‌కి నాయ‌క’ యూట్యూబ్‌లో రికార్డ్!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ చిత్రం ‘జ‌య జాన‌కి నాయ‌క’ హిందీ వెర్ష‌న్ ‘ఖూన్‌ఖ‌ర్‌’కు యూట్యూబ్‌లో 300 మిలియ‌న్ వ్యూస్‌

‘రాక్ష‌సుడు’ సినిమా విజ‌యంతో కెరీర్‌లో ముందుకు వెళ్తోన్న యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో ‘అల్లుడు అదుర్స్’ చిత్రం చేస్తున్నారు. కాగా, ఆయ‌న మునుప‌టి సినిమా ‘జ‌య జాన‌కి నాయ‌క’ యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. దాని హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ‘ఖూన్‌ఖ‌ర్’ 300 మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను దాటింది. అల్లు అర్జున్ ‘స‌రైనోడు’ చిత్రం త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియ‌న్ ఫిల్మ్ ‘ఖూన్‌ఖ‌ర్’ కావ‌డం విశేషం.

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ రోల్ పోషించారు. ప్ర‌గ్యా జైస్వాల్‌, సుమ‌న్‌, త‌రుణ్ అరోరా, శ‌ర‌త్‌కుమార్‌, నందు కీల‌క పాత్ర‌లు చేశారు. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు. ‘జ‌య జాన‌కి నాయ‌క‌’లోని హై వోల్టేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. నిజానికి, హిందీ వెర్ష‌న్ కోసం సాయిశ్రీ‌నివాస్ సినిమాలు శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో మంచి బిజినెస్ చేస్తున్నాయి.

ఆయ‌న న‌టించిన ‘క‌వ‌చం’ చిత్రం హిందీ వెర్ష‌న్‌ ‘ఇన్‌స్పెక్ట‌ర్ విజ‌య్’ యూట్యూబ్‌లో 206 మిలియ‌న్ వ్యూస్ దాట‌గా, ‘అల్లుడు శ్రీ‌ను’ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ‘మ‌హాబ‌లి’ 103 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేయ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. అలాగే, సాయిశ్రీ‌నివాస్ ఇత‌ర హిందీ డ‌బ్బింగ్ ఫిలిమ్స్ సైతం యూట్యూబ్‌లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి.

Jaya Janaki Nayaka Hindi Version Gets 300 Million Views:

Jaya Janaki Nayaka Hindi Version Khoonkhar creates sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ