Advertisementt

శ్రేయాస్ ఈటీలో ‘మగువ’ విడుదలైంది

Sun 06th Sep 2020 04:54 PM
maguva movie,released,shreyas et,maguva trailer response  శ్రేయాస్ ఈటీలో ‘మగువ’ విడుదలైంది
Maguva Movie Released in Shreyas ET శ్రేయాస్ ఈటీలో ‘మగువ’ విడుదలైంది
Advertisement
Ads by CJ

యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమా ‘మగువ’. డిజిటల్ వరల్డ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా ఓటిటి ప్లాట్ ఫామ్‌లో ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఇక థ్రిల్లర్ వంటి సినిమాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ ‘మగువ’.. శనివారం శ్రేయాస్ ఈటీలో విడుదల కానుంది. సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి వంటి నటీనటులు నటించిన చిత్రం ‘మగువ’. ఇటీవల శ్రేయాస్ ఈటీలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఐఎమ్‌డిబి లో ఈ ట్రైలర్ రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇప్పటికే ఈ ట్రైలర్ 5 మిలియన్ పైగా చూశారు, ప్రస్తుతం వ్యూవర్షిప్ 6 మిలియన్‌కు చేరువలో ఉండడం విశేషం. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ దాన్ని ఎక్కడికో తీసుకెళతారనేదానికి ఇది చక్కటి ఉదాహరణ.

యూనివర్సల్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీరామ్ యేదోటి దర్శకుడు. సంగీతం సాబు వర్గీస్ అందించాడు. ఈ రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ లో ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు అగంతకులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఉండే ఒక బిల్డింగ్ కు తీసుకొని వెళ్లి రేప్ అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ అమ్మాయి అక్కడ నుండి తెల్లారేసరికి ప్రాణాలతో బయట పడుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కిడ్నాపర్స్ తో నైట్ అంతా ఆ అమ్మాయి ఏం చేసింది? అసలు కిడ్నాపర్స్ ఏం అయ్యారు? అనేది ఈ మగువ సినిమాలో అసలు పాయింట్. ఈ సినిమాలో థ్రిల్లింగ్‌గా ఉండే అంశాలు చాలా ఉన్నాయి. మంచి స్క్రీన్ ప్లే తో చివరి వరకు కథ ఉత్కంఠభరితంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరామ్ యేదోటి మాట్లాడుతూ... మగువ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈ ట్రైలర్ ను చూశారు,  ఐ. ఎమ్.డి.బి లో మా ట్రైలర్ రెండవ స్థానంలో ఉండడం సంతోషం. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కు 5 మిలియన్ వ్యూస్ దాటాయి. అలాగే ప్రమోషన్ టీజర్ నిన్న విడుదల చేశాం అది 3 మిలియన్ దాటింది. సినిమా కూడా అదే స్థాయిలో మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడదగ్గ చిత్రం. వి సినిమా తో పాటు మా మగువ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లొ శనివారం రాత్రి 9 గంటలకు విడుదల కానుందని తెలిపారు.

నటీనటులు:

సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల,హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: యూనివర్సల్ డ్రీమ్స్

నిర్మాతలు: పి.వెంకటేష్, కె.గణేష్, రాఘవరాజు రెడ్డయ్య, కె.సుబ్రమణ్యం.

సంగీతం: సాబు వర్గీస్

డిఓపి: ఎమ్.ఎన్.బాల

పిఆర్వో: మధు.విఆర్

రచన, దర్శకత్వం: శ్రీరామ్ యేదోటి

Maguva Movie Released in Shreyas ET:

Maguva Movie Release details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ