Advertisementt

నిఖిల్ కుమార్ 4వ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Mon 07th Sep 2020 11:26 AM
nikhil kumar,vijay kumar konda,title and first look,release details  నిఖిల్ కుమార్ 4వ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Nikhil Kumar 4th Film First Look Release Details నిఖిల్ కుమార్ 4వ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

నిఖిల్ కుమార్‌, విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ ఫిల్మ్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల‌

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 11న ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆదివారం ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది.

భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా పాపుల‌ర్ మ్యూజిక్ కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ అధినేత చంద్రు మ‌నోహ‌ర‌న్‌ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. నిఖిల్ కుమార్ స‌ర‌స‌న నాయిక‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

తారాగ‌ణం:

యువ‌రాజా నిఖిల్ కుమార్‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్‌, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కె.ఆర్‌. పీట్‌, నిహారిక‌, సంప‌ద హుళివ‌న‌, అనూష‌

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌: న‌ంద్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాష్‌

డైలాగ్స్‌, కో-డైరెక్ట‌ర్‌: శ‌ర‌త్ చ‌క్ర‌వ‌ర్తి

మ్యూజిక్‌: అర్జున్ జ‌న్యా

సినిమాటోగ్ర‌ఫీ: శ్రీ‌ష ఎం. కుడువ‌ల్లి

ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌

స్టంట్స్‌: డాక్ట‌ర్ ర‌వివ‌ర్మ‌

ఆర్ట్‌: మోహ‌న్ బి. కెరే

క్రియేటివ్ హెడ్‌: సునీల్ గౌడ‌

నిర్మాత‌: చ‌ంద్రు మ‌నోహ‌ర‌న్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా

Nikhil Kumar 4th Film First Look Release Details:

Nikhil Kumar, Vijay Kumar Konda Film Title And First Look Releasing On Sep 11th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ