యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 ఆడియో నుంచి మొదటి సింగిల్ చూసాలే కళ్లారా సాంగ్ ను యంగ్ హీరో నిఖిల్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ట్యూన్స్ తో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన చూసాలే కళ్లారా సాంగ్ మెలోడీగా ఆకట్టుకునే విధంగా క్యాచీగా ఉంది.
‘నీ జతకుదిరాకే నా కదలిక మారేనా వదువిక నీనే ఆ నక్షత్రాల దారే నా పైన’.. అంటూ లిరిక్ రైటర్ కేకే రాసిన సాహిత్యం రిధమిక్‌గా ఉంది. వింటేనే కనెక్ట్ అయ్యే విధంగా సాంగ్ ఉండడం విశేషం. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 అనే వినూత్న సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైన చూశాలే కళ్లారా సాంగ్ కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో శ్రీధర్ దర్శకునిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
తారాగణం:
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జావాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు: ప్రమోద్ - రాజు
కెమెరా: విశ్వాస్ డేనియల్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను
దర్శకత్వం: శ్రీధర్ గాదె