Advertisementt

కీర్తిసురేష్‌ ఐనా ఇష్టంనువ్వు.. ఎప్పుడంటే..?

Thu 17th Sep 2020 12:05 AM
keerthi suresh,naveen vijay krishna,inaa ishtam nuvvu,movie,latest,details  కీర్తిసురేష్‌ ఐనా ఇష్టంనువ్వు.. ఎప్పుడంటే..?
inaa ishtam nuvvu in controversy కీర్తిసురేష్‌ ఐనా ఇష్టంనువ్వు.. ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

అక్టోబర్‌లో విడుదల కానున్న నవీన్ విజయ్ కృష్ణ, కీర్తి సురేష్ ‘ఐనా ఇష్టంనువ్వు’ చిత్రం.

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ‘ఐనా ఇష్టంనువ్వు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత దీనికి ‘ఐనా... ఇష్టంనువ్వు’.  ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ దేవ్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది.

నిర్మాత నట్టికుమార్ ఫైర్ ఈ చిత్రాన్ని తమకు అమ్మినట్లు బాండ్ పేపర్లు సాక్షాధారాలు ఉన్నాయి, అయినా సరే ఎస్ట్రా మనీ కోసం నిర్మాత చంటి అడ్డాల తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్, సంగీతం: అచ్చు, నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం రాంప్రసాద్ రౌతు.

inaa ishtam nuvvu in controversy:

inaa ishtam nuvvu movie latest details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ