Advertisementt

ఎన్. శంకర్ వదిలిన ‘తెరవెనుక’ ఫస్ట్ లుక్

Fri 18th Sep 2020 02:15 PM
director,n shankar,thera venuka,movie,first look,launche  ఎన్. శంకర్ వదిలిన ‘తెరవెనుక’ ఫస్ట్ లుక్
Director N Shankar Launches Thera Venuka Movie First Look ఎన్. శంకర్ వదిలిన ‘తెరవెనుక’ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ‘తెరవెనుక’. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి, నిట్టల శ్రీరామమూర్తి, TNR, శ్వేత వర్మ, సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ... తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెరవెనుక అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ... సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న తెరవెనుక చిత్ర ఫస్ట్ లుక్ ఎన్. శంకర్ గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత మురళి జగన్నాధ్ మచ్చ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. అందరి అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చెయ్యబోతున్నామని తెలిపారు.

నటీనటులు:

అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి, ఆనంద చక్రపాణి, నిట్టల శ్రీరామమూర్తి, టి.ఎన్.ఆర్, శ్వేత వర్మ, సంపత్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:

కథ, మాటలు -  బాబా

కెమెరా - రాము కంద,

ఎడిటర్ - బొంతల నాగేశ్వరరెడ్డి

మ్యూజిక్ - రఘురామ్  

ఫైట్స్ - సూపర్ ఆనంద్

డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్

లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్

పిఆర్వో- మధు వి.ఆర్

Director N Shankar Launches Thera Venuka Movie First Look:

Thera Venuka Movie First Look Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ