తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదాశర్మ ‘?’ క‌్వశ్చన్ మార్క్ పోస్టర్ లాంచ్!!
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ హీరోయిన్‌గా విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). ఈ చిత్రం పోస్టర్ లాంచ్ శుక్రవారం తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన నివాసంలో జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా వల్ల ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ కరువైంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి మెసేజ్‌తో వస్తోన్న ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు, హీరోయిన్‌కు మరియు ఇతర యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘కరోనా టైమ్‌లో ప్రారంభించి షూటింగ్ పూర్తి చేశాం. కరోనా వల్ల ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితిలో మా హీరోయిన్ ఆదాశర్మ మా సినిమా షూటింగ్ కోసం సహకరించారు. మా దర్శకుల ప్లానింగ్ వల్లే క్రిటికల్ సిట్యుయేషన్‌లో సినిమాను అనుకున్నవిధంగా తీయగలిగాం. మా టీమ్ అంతా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సహకరించడం వల్లే ఈ రోజు మా సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ రోజు మా సినిమా పోస్టర్ తలసాని శ్రీనివాస్‌గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
దర్శకులు విప్రా మాట్లాడుతూ.. ‘‘తలసానిగారు మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ. కరోనా టైమ్‌లో మా సినిమా షూటింగ్‌కి సహకరించిన ఆదాశర్మగారికి మా నిర్మాత గౌరికృష్ణ గారికి ధన్యవాదాలు. క్వచ్చన్ మార్క్ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూస్తే ఈ టైటిల్ యాప్ట్ అంటారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.
హీరోయిన్ ఆదాశర్మ మాట్లాడుతూ.. ‘‘కరోనా టైమ్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఫస్ట్ సినిమా మాదే అనుకుంటా. సినిమా చాలా బాగా వచ్చింది, నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ఇద్దరు డైరక్టర్స్ ఈ సినిమా చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ పర్సన్స్. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అన్నారు.
బ్యానర్: శ్రీ కృష్ణ క్రియేషన్స్
టైటిల్: క్వశ్చన్ మార్క్ (?)
హీరోయిన్: ఆదాశర్మ
కెమెరా: వంశీ ప్రకాష్
ఎడిటర్: ఉద్ధవ్
సంగీత దర్శకుడు: రఘు కుంచె
ఆర్ట్ డైరెక్టర్: ఉప్పెందర్ రెడ్డి
పి ఆర్ ఓ: వంగల కుమార స్వామి
నిర్మాత: గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం : విప్రా