Advertisementt

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ స్పెషల్‌ రాబోతోంది

Mon 21st Sep 2020 01:05 AM
chaavu kaburu challaga,karthikeya,birthday,basthi balaraju  ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ స్పెషల్‌ రాబోతోంది
Chaavu Kaburu Challaga Special update on Karthikeya Birthday ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ స్పెషల్‌ రాబోతోంది
Advertisement
Ads by CJ

సెప్టెంబ‌ర్ 21న ఉద‌యం 11:47 ని.ల‌కు జీఏ2 పిక్చ‌ర్స్ - ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ మూవీ నుంచి స్పెష‌ల్ వీడియో విడుద‌ల‌

మెగా ప్రొడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా, హ్యాపెనింగ్ యంగ్ హీరో కార్తీకేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ టైటిల్ తోనే అటు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో, ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పంద‌న ల‌‌భించడం విశేషం. దాంతో పాటే విడుద‌ల చేసిన హీరో కార్తికేయ పోషించిన ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్ సైతం సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అందుకుంది.

ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా‌, ఉద‌యం 11: 47 ని.ల‌కు వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే ముగిసింది. ఇక‌ త్వ‌ర‌లోనే నూత‌న షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే దిశ‌గా ప్లాన్ చేస్తున్న‌ట్లుగా నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు. 

తారాగ‌ణం

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

సినిమాటోగ్రాఫ‌ర్ - సునీల్ రెడ్డి

మ్యూజిక్ - జకీస్ బిజాయ్

ద‌ర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

Chaavu Kaburu Challaga Special update on Karthikeya Birthday:

Chaavu Kaburu Challaga Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ