‘DSJ’ ‘దెయ్యంతో సహజీవనం...’ మూవీతో ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ తెరంగేట్రం
నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం...) మూవీ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి. సమర్పణ నట్టి లక్ష్మి. ఈ చిత్రం మహూర్తపు షాట్‌కి నట్టి క్రాంతి డైరెక్షన్ చేయగా... కెమెరా నట్టి లక్ష్మీ స్విచాన్ చేశారు. ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, ఈ చిత్రం డైరెక్టర్ నట్టి కుమార్ మాట్లాడుతూ... ‘ఈ చిత్రాన్ని ఒక యాథార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో పోషిస్తోంది. ఆమెతో ఓ ఐటెం సాంగ్ కూడా చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా హైదరాబాద్‌లో జరిపి.. తదుపరి షెడ్యూల్ కర్ణాటకలోని మంగళూరులో చేసి చిత్రాన్ని పూర్తి చేస్తాం’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘గతంలో ఏడాదికి 8 నుంచి 9 సినిమాలు నిర్మాంచా. ఇక రాబోయే కాలంలో కూడా ఏడాదికి 15 సినిమాల దాకా నిర్మించాలని నిర్ణయించుకున్నా’ అన్నారు.
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ... ‘గతంలో నాన్న నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నా. ఆ అనుభవం చిత్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. నాన్న డైరెక్షన్‌లో ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది. నాన్న నా మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఇందులో నటిస్తానని ఆశిస్తున్నా. మీ ఆశీర్వాదం నాకు కావాలి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించేలా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
హీరో రాజీవ్ సాలూరు మాట్లాడుతూ... ‘నట్టి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ఆర్జే హేమంత్, స్నిగ్ధ, బాబూ మోహన్, జీవా, రాయల్ హరిశ్చంద్ర(బాహుబలి ఫేం) తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎ.ఖుద్దూస్, సినిమాటోగ్రాఫర్: కోటి, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: వెంకట రమణ, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణ రెడ్డి, కో డైరెక్టర్: సాయి త్రివేది, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వాల్మీకి శ్రీనివాస్, కాస్ట్యూమ్ డిజైనర్: హేమ, కాస్ట్యూమ్ చీఫ్: మురళి, మేకప్: భాస్కర్, ఫైట్ మాస్టర్: అంజి, పబ్లిసిటీ డిజైనర్: గణేష్, పి.ఆర్.ఓ.: మధు వి.ఆర్.