Advertisementt

ఉర్వశి రౌటేలా ‘బ్లాక్ రోజ్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!

Thu 24th Sep 2020 07:39 PM
miss india,urvashi rautela,black rose,sampath nandi  ఉర్వశి రౌటేలా ‘బ్లాక్ రోజ్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!
‘Black Rose’ Movie first Look released ఉర్వశి రౌటేలా ‘బ్లాక్ రోజ్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!
Advertisement
Ads by CJ

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ బేన‌ర్‌లో ఉర్వశి రౌటేలా హీరోయిన్‌గా సంపత్ నంది క్రియేష‌న్ ‘బ్లాక్ రోజ్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌.

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్‌లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటిసారి తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించడానికి లేడీ షైలాక్ రూపంలో రాబోతున్న చిత్రం ‘బ్లాక్‌రోజ్’‌. పలు సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను బుధవారం విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.

ఏమైంది ఈ వేళ , రచ్చ , బెంగాల్ టైగర్ చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులని అలరించిన ప్ర‌ముఖ‌ దర్శకుడు సంపత్ నంది షేక్స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్’’ లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ  చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ‘‘యోగ్యత లేని, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’’ అనే కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లోని కాన్సెప్ట్ ని జోడిస్తూ అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

3వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక పైనాన్స్ కంపెనీ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పని చేస్తున్న ఒక స్ట్రాంగ్ మోడరన్ వుమన్ వసుధ లైఫ్‌లో ఒకరోజు జరిగిన కథ ఈ ‘బ్లాక్ రోజ్’. చిత్ర యూనిట్ మొత్తానికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జ‌రిపి ఒకే షెడ్యూల్‌లో సినిమాని పూర్తిచేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్,

ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ,

ఎడిటర్: తమ్మిరాజు,

పిఆర్ఓ: బి.ఎ.రాజు,

డిఓపి: సౌందర్ రాజన్. ఎస్,

సంగీతం: మణిశర్మ,

సమర్పణ: పవన్ కుమార్,

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,

క్రియేటెడ్ బై: సంపత్ నంది,

దర్శకత్వం: మోహన్ భరద్వాజ్.

‘Black Rose’ Movie first Look released:

Miss India Urvashi Rautela Starrer Emotional Thriller ‘Black Rose’ Created By Sampath Nandi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ