Advertisementt

అడివి శేష్ సినిమాలో సల్మాన్‌ హీరోయిన్‌..!!

Thu 24th Sep 2020 10:02 PM
saiee manjrekar,major,adivi sesh,salman khan,heroine  అడివి శేష్ సినిమాలో సల్మాన్‌ హీరోయిన్‌..!!
Saiee Manjrekar joins the cast of Major starring Adivi Sesh అడివి శేష్ సినిమాలో సల్మాన్‌ హీరోయిన్‌..!!
Advertisement
Ads by CJ

అడివి శేష్ సినిమా ‘మేజ‌ర్‌’లో స‌యీ మంజ్రేక‌ర్‌

అడివి శేష్ టైటిల్ పాత్ర‌ధారిగా శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మేజ‌ర్‌’.

స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ‘ద‌బాంగ్ 3’లో న‌టించి, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన స‌యీ మంజ్రేక‌ర్ (న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ కుమార్తె) ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్‌కు ఎంపిక‌య్యారు. హైద‌రాబాద్‌లో వ‌చ్చే నెల‌లో ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొన‌నున్నారు.

2008 న‌వంబ‌ర్ 26న జ‌రిగిన ముంబై టెర్ర‌రిస్ట్ దాడుల్లో అమ‌రుడైన‌ ఎన్ఎస్‌జీ క‌మాండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ‘మేజ‌ర్’ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ క్యారెక్ట‌ర్‌ను అడివి శేష్ పోషిస్తుండగా, గూఢ‌చారి హీరోయిన్ శోభిత ధూళిపాళ ఓ ముఖ్య పాత్ర‌ను చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

‘మేజ‌ర్‌’ మూవీని సోనీ పిక్చ‌ర్స్ ఫిలిమ్స్ ఇండియా, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు చెందిన జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏ ప్ల‌స్ ఎస్ మూవీస్ క‌లిసి నిర్మిస్తున్నాయి. 2021 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు సంక‌ల్పించారు.

Saiee Manjrekar joins the cast of Major starring Adivi Sesh:

Salman Khan Heroine in Adivi Sesh Major Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ