ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఈప్పుడు మరింత విషమించిందని MGM ఆసుపత్రి వర్గాలు తెలియ చేస్తున్నాయి.ఆయనకు కరోనా సోకటంతో ఆగష్టు 5 న MGM హెల్త్ కేర్ లో చేరారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు అధికం కావటం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు సాయంత్రం 6:30 MGM ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. వెంటిలేటర్ ఫై వున్నా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. ఆయన కోలుకుని తిరిగి రావాలని సినీ వర్గాలు దేవునికి ప్రార్ధనలు చేస్తున్నారు.