Advertisementt

‘డిఎస్‌జె’ లోకేషన్లో ‘సైకో వర్మ’ హీరో బర్త్‌డే వేడుక

Sun 27th Sep 2020 07:51 PM
natti kumar,son,natti kranthi,birthday,celebration,event,saiko varma  ‘డిఎస్‌జె’ లోకేషన్లో ‘సైకో వర్మ’ హీరో బర్త్‌డే వేడుక
Natti Kranthi birthday celebrations at DSJ sets ‘డిఎస్‌జె’ లోకేషన్లో ‘సైకో వర్మ’ హీరో బర్త్‌డే వేడుక
Advertisement
Ads by CJ

‘DSJ’ షూటింగ్ లొకేషన్లో ‘సైకో వర్మ’ హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’ వీడు తేడా అనేది ఉప శీర్షిక.

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఇందులో హీరోగా నటిస్తున్నారు. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘DSJ’(దెయ్యంతో సహజీవనం) సినిమా లొకేషన్లో  శనివారం హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

ముందుగా గాన గంధర్వుడు దివంగత ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి నివాళులర్పించి... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.

అనంతరం నిర్మాత నట్టుకుమార్ మాట్లాడుతూ... ‘ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తీస్తున్న ‘సైకో వర్మ’ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సినిమా బాగా వచ్చింది. కరోనా టైంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేశాం. మా అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు. నేను అనుకున్న దానికంటే బాగా నటిస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఎల్లప్పుడూ కావాలి. రీసెంట్‌గా వొదిలిన 30 సెకెన్ల టీజర్‌కి బాగా రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే పాటను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీంతో పాటు మరో ఐదారు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి’ అన్నారు.

హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ... ‘కొంచం టెన్షన్ అయినా షూటింగ్ బాగా చేస్తున్నాం. కోవిడ్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాం. ఇంకో షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి’ అన్నారు.

నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ.... ‘మా బ్రదర్‌కి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండటం వల్ల మా బ్రదర్ బర్త్‌డే వేడుకలు ఇంకా బాగా చేయలేకపోతున్నాం. ఇలాంటి బర్త్‌డే వేడుకలు మా బ్రదర్ మరిన్ని జరుపుకోవాలని ఆశీర్వదించండి. బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అన్నారు.

నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి లక్ష్మి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇతర పాత్రలలో అప్పాజీ, మీనా, రూపలక్ష్మి, శ్రీధర్ పోతూరి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య తదితరులు నటిస్తున్నారు.

చిత్రానికి సంగీతం: ఎస్‌.ఏ.ఖుద్దూస్‌, ఛాయాగ్రహణం: జనార్ధననాయుడు, డి.ఓ. పి.: జనా, ఎడిటింగ్: గౌతమ్ రాజు, ఆర్ట్: కె.వి. రమణ, కొరయోగ్రఫీ: అనీష్, లైన్ ప్రొడ్యూసర్స్: కె.ప్రేమ సాగర్, ఎస్. రమణా రెడ్డి, స్టిల్స్: నూక రమేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వాల్మీకి శ్రీనివాస్, పి.ఆర్. ఓ.: మధు. వి.ఆర్.

Natti Kranthi birthday celebrations at DSJ sets:

Natti kumar son birthday celebration event details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ