తడ ఫస్ట్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్ సుకుమార్
చేతన్ చీను హీరోగా తడ అనే సినిమా రూపొందుతోంది. ఎస్.కె. దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని 24 ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిథున్ మురళి, పద్మ సత్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఇది తయారవుతోంది. చేతన్ చీను పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో చేతన్ చీను ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యభరితమైన మాస్ లుక్‌తో కనిపిస్తున్నారు. పెరిగిన గడ్డం, బనియన్, తలకు చుట్టిన హ్యాండ్ కర్చీఫ్‌తో, చేతిలో పదునైన ఆయుధంతో దేనికోసమో వేటాడుతున్నట్లు సునిశితమైన చూపుతో ఆయన కనిపిస్తున్నారు. ఆయన వంటిపై రక్తపు మరకలు దాన్నే తెలియజేస్తున్నాయి. ఆయన లుక్, తడ టైటిల్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలో ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం వివరాలను వెల్లడించనున్నారు. నిర్మాతలు: మిథున్ మురళి, పద్మసత్య. దర్శకత్వం: ఎస్.కె. బ్యానర్: 24 ఆర్ట్స్ ప్రొడక్షన్స్.