Advertisementt

ఈ కథలో పాత్రలు కల్పితం ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్!

Fri 09th Oct 2020 07:40 PM
ee kathalo patralu kalpitam movie,ee kathalo patralu kalpitam songs,ee kathalo patralu kalpitam,  ఈ కథలో పాత్రలు కల్పితం ఫ‌స్ట్ లిరిక‌ల్  సాంగ్!
Ee Kathalo Patralu Kalpitam First Song ఈ కథలో పాత్రలు కల్పితం ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్!
Advertisement
Ads by CJ

స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి రిలీజ్ ‌చేసిన ఈ కథలో పాత్రలు కల్పితం ఫ‌స్ట్ లిరిక‌ల్  వీడియో సాంగ్ క‌న్న‌యే క‌ళ్ళు.

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ఈ కథలో పాత్రలు కల్పితం. పవన్‌ తేజ్‌ కొణిదెల స‌ర‌స‌న మేఘన హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ నుండి  క‌న్న‌యే క‌ళ్ళు  ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని ఈ రోజు మ‌ధ్యాహ్నం 03:02నిమిషాల‌కు స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి విడుద‌ల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ - క‌న్న‌యే క‌ళ్ళు  ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన సురేంద‌ర్ రెడ్డిగారికి నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ కథలో పాత్రలు కల్పితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఆర్టిస్టులు, టెక్నిషయన్స్ నుండి మంచి సపోర్ట్ లభించింది. మా మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి  పాజిటివ్ బజ్ క్రియేట్ అవ‌డంతో మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాము.  దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించారు.  జెస్సీ, రీసెంట్ గా వచ్చిన ఓ పిట్టకథ..సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌  సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ఆర్‌ఎక్స్‌ 100, కల్కి చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్ అన్నారు.

డైరెక్టర్ అభిరామ్ ఎమ్‌ మాట్లాడుతూ -  హీరో పవన్ తేజ్ కొణిదెలకు ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి పేరు తెస్తుంది.  కథ, కథనాల‌తో పాటు కార్తిక్ కొనకండ్ల అందించిన సంగీతం ఈ మూవీకి పెద్ద అసెట్‌. నిర్మాత రాజేష్ నాయుడు గారి స‌హ‌కారంతోనే సినిమాను ఇంత రిచ్ గా, అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించ‌గ‌లిగాము. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తాం అన్నారు. 

Click Here: ఈ కథలో పాత్రలు కల్పితం ఫ‌స్ట్ లిరిక‌ల్  వీడియో సాంగ్ 

Ee Kathalo Patralu Kalpitam First Song:

Ee Kathalo Patralu Kalpitam Songs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ