Advertisementt

అనీష్ కృష్ణ‌కు నాగ‌శౌర్య హీరో!

Fri 16th Oct 2020 01:53 PM
hero nagashourya new movie!director aneesh krishna,producer usha mulpuri,ira creations   అనీష్ కృష్ణ‌కు నాగ‌శౌర్య హీరో!
Hero Nagashourya New Movie! అనీష్ కృష్ణ‌కు నాగ‌శౌర్య హీరో!
Advertisement
Ads by CJ

నాగ‌శౌర్య హీరోగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4 ఫిల్మ్‌.

 హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేష‌న్స్ స‌న్నాహాలు ప్రారంభించింది.

శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా అఫిషియ‌ల్‌గా ఆ మూవీని ప్ర‌క‌టించారు.

ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది. డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా.

ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇదివ‌ర‌కు నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఛ‌లో కు ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని చూసీ చూడంగానే.. సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసు. షూటింగ్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు.

సాంకేతిక బృందం: స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి. బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌. సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌. స‌హ నిర్మాత‌:  బుజ్జి. పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌. డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎస్‌.ఎన్‌. గౌత‌మ్‌. నిర్మాత‌: ఉష ముల్పూరి.  డైరెక్ట‌ర్‌: అనీష్ కృష్ణ‌. 

Hero Nagashourya New Movie!:

Hero Nagashourya New Movie!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ