Advertisementt

నిఖిల్ 18 పేజీస్ లో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్!

Mon 19th Oct 2020 11:51 AM
anupuma 18 pages movie,anupama parameswaran nikhil movie 18 pages,sukumar,ga 2 pictures,sukumar writings,18 pages movie,nikhil 18 pages movie  నిఖిల్ 18 పేజీస్ లో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్!
Anupama Parameswaran to pair with Nikhil in 18 Pages నిఖిల్ 18 పేజీస్ లో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్!
Advertisement
Ads by CJ

  జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ లో డైనిమిక్ హీరో నిఖిల్ కి జోడిగా అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు పై టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్. యంగ్ డైన‌మిక్ నిఖిల్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా చిత్ర బృందం నిఖిల్ కి ఈ సినిమాలో జోడిని కూడా ఎంపిక చేశారు. అటు త‌న అభిన‌యంతో ఇటు త‌న అందాల‌తో తెలుగు కుర్ర‌కారు హృద‌యాల్ని దోచుకుంటున్న మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస‌కుంటున్న‌ట్లుగా 18 పేజీస్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. నిఖిల్, అనుప‌మ జోడి ఆన్ స్క్రీన్ అద్భుతంగా క‌నిపిస్తొంద‌ని, వారి క్యారెక్ట‌ర్లు కూడా ఆడియెన్స్ ని ఆద్యంతం అల‌రించేలా తీర్చిదిద్దుతున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ తెలిపారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నారు.

న‌టీన‌టులు: నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్, బ్యాన‌ర్ - జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్, క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్, మ్యూజిక్ - గోపీ సుంద‌ర్, నిర్మాత - బ‌న్నీ వాసు, ద‌ర్శ‌క‌త్వం - ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్.

Anupama Parameswaran to pair with Nikhil in 18 Pages :

Anupama Parameswaran to pair with Nikhil in 18 Pages 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ