Advertisementt

రాయే నువ్వు రాయే ఆడియో బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్!

Mon 19th Oct 2020 12:08 PM
bomma blockbuster movie,raye nuvu raye audio,nandu,rashmi gautham,producers praveen pagadala,director raj virat,bomma blockbuster movie  రాయే నువ్వు రాయే ఆడియో బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్!
Raye Nuvu Raye audio from Bomma Blockbuster! రాయే నువ్వు రాయే ఆడియో బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్!
Advertisement
Ads by CJ

బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ ఆడియో ఫ‌స్ట్ సింగిల్ రాయే నువ్వు రాయే ను విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ ‌బ్లాక్ బ‌స్ట‌ర్. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజ‌య్ కృష్ణ‌, డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంట‌గా న‌టిస్తున్నారు. ముందుగా టైటిల్ ఆ త‌రువాత విడుద‌ల చేసిన టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర యూనిట్. ఈ నేప‌థ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి  రాయే నువ్వు రాయే అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గారు ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా న‌టిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాట‌లో ఉంది.

న‌టీన‌టులు: నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్. 

సాంకేతిక వ‌ర్గం: ఎడిటర్ : బి. సుభాష్కర్పీ, ఆర్.ఓ : ఏలూరు శ్రీను, పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే, సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్, మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి, నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ. రచన - దర్శకత్వం : రాజ్ విరాట్.

bomma blockbuster movie,raye nuvu raye audio,nandu,rashmi gautham,producers praveen pagadala,director raj virat,bomma blockbuster movie

Raye Nuvu Raye audio from Bomma Blockbuster!:

Raye Nuvu Raye audio from Bomma Blockbuster!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ